Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..! 7 d ago

8K News-25/03/2025 దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్ గా ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 78,296.28 పాయింట్ల వద్ద క్రితం ముగింపు 77,984.38 లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 78,741.69 వద్ద గరిష్ఠాన్ని తాకింది.. 77,745.63 వద్ద కనిష్ఠాన్ని తాకి.. చివరికి 32.81 పాయింట్ల లాభపడి 78,017.19 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక, నిఫ్టీ 10.30 పాయింట్ల లాభంతో 23,668.65 వద్ద ముగిసింది.